నెలలు నిండని పసిగుడ్డును కన్నవాళ్లే కడతేర్చిన అమానుషమైన ఘటన గుజరాత్లోని కాదీ మెహ్సానా జిల్లాలో చోటు చేసుకుంది. ఆడ శిశువు పుట్టిందని తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి.. నెల వయసు ఉన్న ఆ చిన్నారి ప్రాణం తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆడపిల్ల పుట్టిందని కన్నవారే కర్కశంగా... - killings
10:16 March 14
ఆడపిల్ల పుట్టిందని కన్నవారే కర్కశంగా...
దంపతులకు ఇప్పటికే ఓ కూతురు ఉంది. ఏడాది క్రితం మరో ఆడశిశువు జన్మించింది. నెలరోజుల తర్వాత ఆ శిశువు అనుమానాస్పద స్థితిలో మరణించింది.
దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంవత్సరం తర్వాత పోస్టుమార్టం నివేదికను విడుదల చేశారు. దీంట్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. మళ్లీ కూతురే పుట్టడం ఇష్టం లేక కన్నవారే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. చిన్నారి ప్రాణం తీసిన తర్వాత కుటుంబ సభ్యులు.. ఆమెది సహజ మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఇంకా.. తమను తప్పుదోవపట్టించాలని చూసినట్లు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:తలపై కొబ్బరికాయలు పగులకొట్టుకున్న భక్తులు
TAGGED:
ఆడ శిశువు పుట్టిందని