తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​లో నాయకత్వమే కాదు సరైన విధానాలూ లేవు' - అసోంలో ప్రచారంలో మోదీ

అసోం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రానికి కాంగ్రెస్​ అన్ని విధాలుగా తీరని నష్టం చేకూర్చిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి, నమ్మకం అనే పవనాలు వీస్తున్నట్లు చెప్పారు.

PM Narendra Modi in Karimganj
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

By

Published : Mar 18, 2021, 5:11 PM IST

అసోంను పాలించిన కాంగ్రెస్​ ప్రభుత్వాలు సామాజికంగా, భౌగోళికంగా, రాజకీయంగా తీరని నష్టాన్ని కలిగించాయని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రాన్ని కాంగ్రెస్​ అన్ని విధాలా విభజించిందని, తాము అన్ని విధాలుగా అనుసంధానించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 'సబ్​కా సాత్​, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్​' అనేదే భాజపా అభివృద్ధి మంత్రంగా చెప్పారు మోదీ.

అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరీమ్​గంజ్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. ఒక వైపు భాజపాకు ఒక విధానం, నాయకత్వం, మంచి ఆలోచనలు ఉంటే.. మరోవైపు కాంగ్రెస్​లో నాయకుడు, సరైన విధానాలూ లేవని విమర్శించారు మోదీ.

"ఈరోజు అసోంలో అభివృద్ధి, నమ్మకం అనే పవనాలు కనిపిస్తున్నాయి. అసోంలో ఇప్పుడు ఒకే సమస్య ఉంది. అది అభివృద్ధి. దశాబ్దాల క్రితం.. ఈ మొత్తం ప్రాంతం మధ్య మంచి అనుసంధానత ఉండేది. అయితే కాంగ్రెస్​ అవినీతి, ఓటు బ్యాంకు పాలనతో అసోంను సరైన సౌకర్యాలు లేని రాష్ట్రాల్లో ఒకటిగా మార్చింది. 2016లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యా. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

బరాక్​ వాలీలో రైలు మార్గం సరిగా లేదన్నారు మోదీ. ప్రజలు ఎప్పటినుంచో రైలు మార్గం కోసం డిమాండ్​ చేస్తున్నట్లు చెప్పారు. రోడ్ల దుస్థితీ దయనీయంగా ఉందన్నారు. అసోంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రజలు సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తోందన్నారు. గ్యాస్​ అనుసంధానం సైతం అనుకున్న స్థాయిలో లేదని గుర్తు చేశారు మోదీ.

ఇదీ చూడండి:బంగాల్ దంగల్: విజయానికి 'ఆమె' ఓట్లే కీలకం!

ABOUT THE AUTHOR

...view details