Omicron in India: భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దక్షిణాఫ్రికా, అమెరికాల నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు మహా సర్కారు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది.
రాజస్థాన్‌లో 10కి
రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో మరొకరికి ఒమిక్రాన్ సోకింది. ఇటీవల జర్మనీ నుంచి జైపుర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయటపడింది. ఆ సంఖ్య సోమవారం నాటికి 10కి పెరిగింది. వీరంతా ఓ వివాహా వేడుకకు హాజరైనట్లు జైపుర్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నరోత్తమ్ శర్మ పేర్కొన్నారు. కొత్త వేరియంట్ సోకిన కుటుంబానికి కాంటాక్ట్ అయిన వారందరికీ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
వివాహానికి హాజరైనవారు దిల్లీ నుంచి జైపుర్‌కు వెళ్లారని.. ఈ పరిణామాలపై దిల్లీ ప్రభుత్వానికి అవగాహన కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఆ కుటుంబ సభ్యులను ముందు జాగ్రత్తగా జైపుర్‌లోని ఆర్‌యుహెచ్‌ఎస్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు చెప్పారు.
ఓ మహిళ ఉక్రెయిన్ నుంచి షార్జా.. షార్జా నుంచి జైపుర్‌లో పెళ్లికి హాజరైనట్లు తెలిసింది. ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. అయితే ఉక్రెయిన్, షార్జా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు.
దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 24కు పెరిగింది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి వివిధ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారికి విమానాశ్రయంలోనే ఆర్టీపీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నాయి.
ఇదీ చూడండి:దేశంలో 21కి చేరిన ఒమిక్రాన్ కేసులు- రాజస్థాన్‌లో 9 మందికి వైరస్