తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడేళ్లకే 'స్ప్రింగ్​ గర్ల్​ ఆఫ్​ నయాగరా' ఘనత! - ఒడిశా యోగా గర్ల్​ ప్రియదర్శిని

రబ్బరు బొమ్మలాగా ఒంటిని భలే వంచేస్తోందే..! ఈ చిన్నారి చేసే స్టంట్లు చూస్తే ఎవ్వరైనా విస్తుపోవాల్సిందే. తలను సునాయాసంగా వంచి, కాలి వేళ్లను ముద్దాడగలదు. రెండు కాళ్లనూ, చేతులనూ పూర్తిగా మడతపెట్టి కూర్చోగలదు. కఠినతరమైన యోగాసనాలను కూడా అలవోకగా చేసేయగలదు. స్ప్రింగ్‌ లాగా ఒళ్లంతా వంచేయగలదు. ఈ ప్రత్యేకతల వల్లే స్ప్రింగ్ గర్ల్ ఆఫ్ నయాగరా అన్న బిరుదు సంపాదించేసుకుందీ బుడత.

Priyadarshini, Yoga girl, Spring girl
ప్రియదర్శిని, యోగా గర్ల్​, స్ప్రింగ్​ గర్ల్​

By

Published : May 4, 2021, 10:40 AM IST

మూడేళ్లకే 'స్ప్రింగ్​ గర్ల్​ ఆఫ్​ నయాగరా' ఘనత!

ఒడిశాలోని రాజ్‌శుంఖల గ్రామానికి చెందిన విజయ కుమార్‌ గారాల పట్టి ప్రియదర్శిని. ఇంకా నాలుగేళ్లైనా నిండలేదు. అయితేనేం..? చక్రాసనం, వృశ్చికాసనం, భూనామాసనం, పాద హస్తాసనం, పశ్చిమోత్తాసనం లాంటి కఠిన యోగాసనాలు ఇట్టే చేసేస్తుంది. ప్రియ.. ఇదంతా చేయడం వెనక ఆమె తండ్రి కృషి ఎంతో ఉంది. పుట్టిన ఏడాదికే ఆమెతో వివిధ ఆసనాలు చేయించాడు. తండ్రి సలహాలు, సూచనలు పాటిస్తూ.. ఒంటిని స్ప్రింగ్‌ లాగా మార్చేసుకుందీ చిన్నారి. నిత్యం సాధన చేసి, యోగా క్వీన్‌గా పేరు తెచ్చుకుంది.

ఇదీ చూడండి:స్కేటింగ్​ చేస్తూ భాంగ్రా నృత్య ప్రదర్శన

"చిన్నవయసు నుంచే యోగా సాధన చేస్తోంది. తను గొప్పగా ఏదైనా చేయాలన్నదే నా కల. చక్రాసనం లాంటి ఎన్నో యోగాసనాలు నేర్పించాను. యోగాలోనే ప్రియకు మంచి భవిష్యత్తు నిర్మించాలనుకుంటున్నా. ప్రముఖ యోగా టీచర్‌గా మార్చుతా."

- విజయ కుమార్ నాయక్, ప్రియ తండ్రి

"ప్రియ వయసు 3 సంవత్సరాల 6 నెలలు. కఠినమైన యాక్రోబాటిక్ యోగా చేస్తుంది. చూస్తే దేహంలో స్ప్రింగ్ ఏమైనా ఉందా అనిపిస్తుంది. చేతులు, కాళ్లను స్ప్రింగ్‌ లాగే కదుపుతుంది."

- భికారి చరణ్ సాహు, స్థానికుడు

ఇదీ చదవండి:వైకల్యాన్ని ఎదుర్కొని ఎందరికో ఆదర్శంగా..

కూతురితో కల సాకారం..

ప్రియ తండ్రి విజయ కుమార్ జిమ్నాస్ట్ అవ్వాలని బాల్యంలో కలలుగనేవాడు. పేదరికం కారణంగా కలను సాకారం చేసుకోలేకపోయాడు. అందుకే తన కుమార్తెను మంచి జిమ్నాస్ట్‌గా లేదంటే యోగా గురువుగా మార్చాలని పూర్తి శ్రద్ధతో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం అత్యాధునిక శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లారు ప్రియ కుటుంబసభ్యులు.

"ప్రియకు 12 రోజుల వయసప్పటి నుంచే వాళ్ల నాన్న శరీరాన్ని మర్దన చేసేవారు. అప్పటి నుంచే యోగా చేయమని ప్రోత్సహించేవారు. ఆయన జిమ్నాస్ట్ అవ్వాలని అనుకున్నారు. కానీ.. డబ్బులేక వెనకడుగు వేశారు. కుమార్తె ద్వారా తన కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు."

- విష్ణుప్రియ నాయక్, ప్రియ తల్లి

పట్టుదల, పరిశ్రమ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాయి. ఇంత పిన్న వయసులోనే యోగాపై ప్రియకు ఉన్న ఆసక్తి, అభిరుచి చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఎప్పటికైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదిద్దాం.

ఇదీ చదవండి:'లక్క కళ'కు జీవం పోస్తున్న రాజస్థాన్​ వాసి

ABOUT THE AUTHOR

...view details