Police steals goats: న్యూఇయర్ వేడుకల కోసం ఓ పోలీసు అధికారి మేకలు దొంగతనం చేసిన ఘటన ఒడిశాలో జరిగింది. బాలంగిర్ జిల్లాలోని సింధేకాలా పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సుమన్ మల్లిక్.. తన సహచరులతో కలిసి రెండు మేకలను దొంగలించాడు. వాటిని న్యూఇయర్ పార్టీ కోసం వధించారు.
'మేకల యజమాని సంకీర్తన గురు.. జంతువులను వధించొద్దని పోలీసులను బతిమిలాడాడు. అయినా మల్లిక్ వినలేదు. చుట్టుపక్కలవారినీ మల్లిక్ బెదిరించాడు. మేకలను కోసి తన సహచరులతో కలిసి పార్టీ చేసుకున్నాడు' అని స్థానికులు తెలిపారు.