ఒడిశా మయూర్భంజ్ జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని పలు గ్రామాలపై దాడి చేసిన ఓ ఏనుగుల గుంపు.. ఇళ్లను ధ్వంసం చేసింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. తీవ్రంగా శ్రమించి ఏనుగుల గుంపును అడవుల్లోకి పంపించారు.
ఝార్ఖండ్ అటవీ పరిధిలోని ఏనుగులు జిల్లాలోకి ప్రవేశించినట్లు వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. అక్రమ మైనింగ్ కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను కోల్పోయి.. జనావాసాల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు.
"మయూర్‌భంజ్‌లోని పలు చిన్న గ్రామాల్లోకి ఝార్ఖండ్ అటవీ ప్రాంతంలోని పలు ఏనుగులు ప్రవేశించి.. రూ.లక్షల విలువైన ఆస్తిని ధ్వంసం చేశాయి. అక్రమ మైనింగ్ కారణంగా అడవులు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా ఏనుగులు వాటి సహజ ఆవాసాలను కోల్పోతున్నాయి. దీంతో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా ఇక్కడి ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు."