తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోమవారమే నితీశ్​ ప్రమాణస్వీకారం - బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​

బిహార్​ ముఖ్యమంత్రిగా నితీశ్​కుమార్​ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదివారం తన నివాసంలో జరిగిన ఎన్​డీఏ కూటమి సమావేశంలో నితీశ్​ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Oath ceremony to be held tomorrow afternoon: JD(U) Chief Nitish Kumar
సోమవారమే నితీశ్​ ప్రమాణస్వీకారం

By

Published : Nov 15, 2020, 3:26 PM IST

బిహార్​ ముఖ్యమంత్రిగా నితీశ్​ కుమార్​ ప్రమాణస్వీకారంపై ఊహాగానాలకు చెక్​ పడింది. సోమవారం రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు నితీశ్​. ఆదివారం ఆయన నివాసంలో జరిగిన ఎన్​డీఏ పక్షాల సమావేశం అనంతరం రాజ్​ భవన్​కు వెళ్లి గవర్నర్​ ఫగు చౌహాన్​ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్​కు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నట్టు వెల్లడించారు.

అంతకుముందు.. ఎన్​డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా నితీశ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నేతలు. దీంతో వరుసగా నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు నితీశ్​.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి విజయం సాధించగా.. భాజపా 74 సీట్లతో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 43 చోట్ల గెలుపొందింది.

ఇదీ చూడండి:-కొరడాతో కొట్టించుకున్న ఛత్తీస్​గఢ్ సీఎం

ABOUT THE AUTHOR

...view details