తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మానవత్వాన్ని చంపేసిన కరోనా! - మహారాష్ట్ర అప్డేట్స్​

కరోనా మహమ్మారితో మనుషుల్లో మానవత్వం సన్నగిల్లుతోంది. వైరస్​ బారినపడి మృతిచెందిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. మహారాష్ట్రలో కొవిడ్​తో చనిపోయిన ఓ వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్​ రాకపోవడం, స్థానిక అధికారులెవరూ స్పందించకపోవడం వల్ల.. చెత్తబండిలోనే తరలించాల్సి వచ్చింది.

No vehicle for last rites of Corona patient, family uses garbage van in Maharashtra
మానవత్వాన్ని చంపేసిన కరోనా!

By

Published : Apr 11, 2021, 7:26 AM IST

కరోనా సృష్టిస్తున్న కల్లోలం మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. కొవిడ్​తో మృతిచెందిన వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లేందుకు వాహనం కరవై.. చెత్తబండిలో తరలించాల్సి వచ్చింది. బాధిత కుటుంబానికి తీవ్ర క్షోభ మిగిల్చిన ఈ ఘటన మహారాష్ట్రలోని ధులే జిల్లాలో జరిగింది.

షక్రి తాలుకా సమోద్​ గ్రామంలో 70 ఏళ్ల వ్యక్తి కరోనాతో శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. శ్మశానానికి తరలించేందుకు తొలుత అంబులెన్స్​కు ఫోన్​ చేస్తే ఎంతకీ రాలేదు. తర్వాత ఏదో ఒక వాహనం కోసం కుటుంబ సభ్యులు రోజంతా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ విషయంలో పంచాయతీ కూడా చేతులెత్తేసింది. చివరికి ఊర్లో చెత్త తరలించే బండిలోనే మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.

ఇదీ చదవండి:కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details