జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించి నేటితో రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. అన్యాయాన్ని చూస్తూ.. పరిస్థితుల్లో అణిగిమణిగి ఉండటం తప్ప ప్రజలకు వేరే దారి లేకుండా చేశారని ట్వీట్ చేశారు.
"రెండు సంవత్సరాల క్రితం ఈరోజు చేసిన ప్రకటన వల్ల జమ్ముకశ్మీర్ ప్రజలు ఎంతలా బాధపడ్డారో మాటల్లో చెప్పలేను. వారు అనుభవించిన బాధను ఫొటోలు చూసి వర్ణించలేం. అన్యాయం, తీవ్ర ఒత్తిడి నడుమ అణిగి ఉండటం తప్ప ప్రజలకు ఇంకో దారి లేకుండా చేశారు."
--మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధ్యక్షురాలు.
చీకటి రోజు..
'జమ్ముకశ్మీర్ చరిత్రలో ఆగస్టు 5 ఓ చీకటిరోజుగానే మిగిలిపోతుంది. ఈ నిర్ణయం జమ్ముప్రజలను రాజకీయంగా, మానసికంగా దెబ్బతీసింది' అని పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఖుర్షీద్ ఆలమ్ అన్నారు.
గుప్కార్ కూటమి భేటీ..