NLC Recruitment 2023 : ప్రభుత్వ రంగ సంస్థ 'ఎన్ఎల్సీ'.. భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 500 ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని తెలిపింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు
- స్పెషలైజ్డ్ మైనింగ్ ఎక్విప్మెంట్ అపరేషన్స్ కేటగిరీ - 238 పోస్టులు
- మైన్స్ అండ్ మైన్స్ సపోర్ట్ సర్వీసెస్ కేటగిరీ - 262 పోస్టులు
విద్యార్హతలు ఏమిటి?
- ఇండస్ట్రీయల్ ట్రైనీ (స్పెషలైజ్డ్ మైనింగ్ ఎక్విప్మెంట్ అపరేషన్స్ కేటగిరీ) అభ్యర్థులు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 3 ఏళ్లకు తగ్గని డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
- ఇండస్ట్రీయల్ ట్రైనీ (మైన్స్ అండ్ మైన్స్ సపోర్ట్ సర్వీసెస్ కేటగిరీ) అభ్యర్థులు - ఫిట్టర్/ టర్నర్/ ఎలక్ట్రీషియన్/ వెల్డింగ్/ ఎంఎంవీ/ డీజిల్ మెకానిక్/ టాక్టర్ మెకానిక్/ సివిల్/ ఫౌండ్రీ/ కేబుల్ జాయింటింగ్ ట్రేడ్స్‌లో ఐటీఐ చేసి ఉండాలి. వాటికి 'ఎన్ఏసీ' సర్టిఫికేషన్ కూడా ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి ఎంత?
- యూఆర్/ఈడబ్ల్యూఎస్ - 37 సంవత్సరాలు
- ఓబీసీ (ఎన్సీఎల్) - 40 సంవత్సరాలు
- ఎస్సీ/ ఎస్టీ - 42 సంవత్సరాలు
ఎంపిక విధానమేంటి?
అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే ఎంపిక ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ కేటగిరీ రిజర్వేషన్లు కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీల వివరాలు :
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 2023 జూన్ 09
- ఆన్లైన్ అప్లికేషన్‌కు చివరి తేదీ : 2023 జులై 08
జీతభత్యాల వివరాలు ఇలా..
- ఇండస్ట్రీయల్ ట్రైనీ (స్పెషలైజ్డ్ మైనింగ్ ఎక్విప్మెంట్ అపరేషన్స్ కేటగిరీ)కి ఎంపికైన వారికి మొదటి ఏడాది రూ.18,000; రెండో ఏడాది రూ.20,000; మూడో ఏడాది రూ.22,000 ఇస్తారు.
- ఇండస్ట్రీయల్ ట్రైనీ (మైన్స్ అండ్ మైన్స్ సపోర్ట్ సర్వీసెస్ కేటగిరీ)కి ఎంపికైన వారికి మొదటి ఏడాది రూ.14,000; రెండో ఏడాది రూ.16,000; మూడో ఏడాది రూ.18,000 ఇస్తారు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
- స్టెప్ 1 : అభ్యర్థులు ఎన్సీఎల్ అధికారిక వెబ్సైట్ www.nclindia.inను ఓపెన్ చేయాలి.
- స్టెప్ 2 : అభ్యర్థులు తమ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అందుబాటులో ఉంచుకోవాలి.
- స్టెప్ 3 : సెల్ఫ్ అటాస్ట్ చేసిన ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్‌లోడ్‌లో ఏమైనా పొరపాట్లు చేస్తే, మీ అప్లికేషన్ రిజక్ట్ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- స్టెప్ 4 :తరువాత అప్లికేషన్ ఫారమ్‌ని నింపి సబ్మిట్ చేయాలి.
- స్టెప్ 5 : రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి మీరు సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు చూపించాల్సి ఉంటుంది.