తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సింఘు 'హత్య' కేసులో లొంగిపోయిన నిందితుడు!

సింఘు సరిహద్దు(Singhu Border News) వద్ద జరిగిన దారుణ హత్యకు సంబంధించిన కేసులో ఓ వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ వ్యక్తిని నిహాంగ్​ సిఖ్​​గా పోలీసులు గుర్తించారు.

Singhu border case
సింఘు హత్య కేసు

By

Published : Oct 15, 2021, 9:59 PM IST

Updated : Oct 16, 2021, 6:25 AM IST

దిల్లీలో కలకలం సృష్టించిన సింఘు సరిహద్దు(Singhu Border News) హత్య కేసులో ఓ వ్యక్తి లొంగిపోయాడు. అతణ్ని సరబ్‌జిత్ సింగ్ అలియాస్​ నిహాంగ్​ సిఖ్​గా అధికారులు గుర్తించారు. రైతుల దీక్షాస్థలి వద్ద జరిగిన హత్యకు బాధ్యత వహిస్తూ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. యువకుడి మణికట్టు, కాలును కత్తిరించి బారికేడ్లకు వేలాడతీసిన విషయాన్నిఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..

రైతు ఆందోళనలు జరుగుతున్న సింఘు సరిహద్దులో దారుణంగా హత్య జరిగింది. 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి చేయిన నరికి, బారికేడ్‌లకు వేలాడదీశారు. శుక్రవారం ఉదయం ఈ వార్త కలకలం రేపింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:రైతు నిరసనల ప్రాంతంలో దారుణ హత్య.. అర్ధనగ్నంగా మృతదేహం

Last Updated : Oct 16, 2021, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details