ప్రత్యేక ఖలిస్థాన్ రాష్ట్రం కోసం భారత్‌లో మళ్లీ సిక్కు ఉద్యమాన్ని ప్రేరేపించేందుకు యత్నించారనే కేసులో ఖలిస్థాన్ ఉగ్రవాది గుర్జీత్ సింగ్ నిజ్జర్‌ను జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్ఐఏ అరెస్టు చేసింది. 2017 నుంచి సైప్రస్‌లో దాక్కున్న నిజ్జర్‌ను భారత్‌కు రప్పించి దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సిక్కు ఉద్యమాన్ని ప్రేరేపించే ప్రయత్నాల్లో భాగంగా నిజ్జర్ మరో ఇద్దరు ఉగ్రవాదులు హర్పాల్ సింగ్, మొయిన్ ఖాన్‌లతో కలిసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది.
ఖలిస్థాన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
సైప్రస్‌లో తలదాచుకున్న ఖలిస్థాన్ ఉగ్రవాది గుర్జీత్ సింగ్ నిజ్జర్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. భారత్‌లో సిక్కు ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడానికి కుట్ర చేస్తున్నాడనే ఆరోపణలతో.. సైప్రస్ ప్రభుత్వం అతన్ని తమ దేశం నుంచి బహిష్కరించింది.
ఎన్ఐఏ అదుపులో ఖలీస్థానీ ఉగ్రవాది..
పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్‌ను హత్య చేసిన ఉగ్రవాది జగ్తార్‌సింగ్ హవారను పొగడడం సహా ఖలిస్థాన్ ఉద్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు, 1984 ఆపరేషన్ బ్లూ స్టార్‌కు సంబంధించిన పోస్టులను పెడుతున్నట్లు వెల్లడించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టుల ద్వారా సిక్కు యువత ఖలిస్థాన్ ఉద్యమంలో చేరేలా ప్రయత్నించారని తెలిపింది.
Last Updated : Dec 23, 2020, 9:54 PM IST