తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో నలుగురు 'నార్కో' ఉగ్రవాదుల అరెస్ట్ - హిజ్బుల్ ముజాహుద్దీన్

మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా జమ్ముకశ్మీర్​ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు.. పాకిస్థాన్​ నుంచి మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) ప్రకటించింది.

NIA arrests 4 drug traffickers in Kashmir narco-terrorism case
కశ్మీర్​లో నార్కో ఉగ్రవాదుల అరెస్ట్

By

Published : Mar 1, 2021, 9:53 PM IST

లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను ఎన్​ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరంతా గతేడాది జూన్​లో మాదకద్రవ్యాల సరఫరా కేసులో పట్టుబడిన నిందితులుగా ఎన్​ఐఏ పేర్కొంది.

గతేడాది జూన్​లో 21కేజీల హెరాయిన్​ సహా.. రూ. 1.35 కోట్ల నగదు పట్టుబడ్డ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అందిన పక్కా సమాచారంతో వీరిని పట్టుకున్నట్లు ఎన్​ఐఏ వెల్లడించింది. వీరంతా జమ్ముకశ్మీర్ ​వ్యాప్తంగా మాదకద్రవ్యాల సరఫరా ముఠాగా ఏర్పడ్డారని తెలిపింది.

పట్టుబడిన వారిని అల్తాఫ్​ అహ్మద్​ షా, షౌకత్ అహ్మద్ ప్యారీ, ముదస్సిర్ అహ్మద్ దార్​, అమిన్​ అల్లీలుగా గుర్తించారు.

పాక్​కు రహస్య సమాచారం..

నిందితులంతా లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహుద్దీన్​ వంటి ఉగ్రవాద సంస్థలతో రహస్యంగా ఛాటింగ్​ చేస్తూ.. సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించారు. నిషేధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ కశ్మీర్​లో ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఎన్​ఐఏ తెలిపింది. ఈ ముఠా కార్యకలాపాలపై గతేడాది జూన్​లోనే కేసు నమోదు చేసిన ఎన్​ఐఏ.. డిసెంబర్​లో ఛార్జిషీట్​ను దాఖలు చేసింది.

నిందితులకు శ్రీనగర్​ కోర్టు మూడురోజుల రిమాండ్​ విధించింది. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుస్తాయని ఎన్​ఐఏ అధికారి ఒకరు వివరించారు.

ఇదీ చదవండి:పుల్వామా దాడి: పాక్​లో వ్యూహం- అఫ్గాన్‌లో శిక్షణ

ABOUT THE AUTHOR

...view details