భారత్లో కరోనా సునామీ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 3293 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2 లక్షలు దాటింది. ఒక్కరోజే 3,60,960 మందికి వైరస్ సోకింది. 2,61,162 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
మొత్తం కేసులు: 1,79,97,267
మొత్తం మరణాలు: 2,01,187
మొత్తం కోలుకున్నవారు: 1,48,17,371
యాక్టివ్ కేసులు: 29,78,709
కరోనా కట్టడిలో భాగంగా.. మొత్తం 14 కోట్ల 78 లక్షల 27 వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఒక్కరోజే 17,23,912 నమూనాలు పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 28 కోట్ల 27 లక్షలు దాటింది.
ఇదీ చూడండి:ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం- నలుగురు రోగులు మృతి