తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈ ఏడాది ఒక్కసారే 'నీట్'' - రమేశ్​ పోఖ్రియాల్​

ఈ ఏడాది నీట్​ ప్రవేశ పరీక్ష ఒకేసారి ఉంటుందని లోక్​సభ వేదికగా ప్రకటించారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​.

NEET to be conducted only once this year,
ఈ ఏడాదిలో ఒక్కసారే 'నీట్'

By

Published : Mar 15, 2021, 5:05 PM IST

2021లో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష-నీట్​ (యూజీ) ఒకేసారి నిర్వహించనున్నట్లు ప్రకటించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​. ​నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ(ఎన్​టీఏ) ఈ పరీక్ష నిర్వహిస్తుందని తెలిపారు.

నీట్​ నిర్వహణపై భాజపా ఎంపీ లల్లూ సింగ్​ అడిగిన ప్రశ్నకు.. లోక్​సభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు పోఖ్రియాల్​. ఎంబీబీఎస్​లో ప్రవేశానికి గాను విద్యా శాఖ ఆధ్వర్యంలో.. నీట్​ పరీక్షను ఎన్​టీఏ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు.. నీట్​ పరీక్షను ఒకేసారి నిర్వహించే అంశంపై తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఎన్​టీఏ పేర్కొంది.

నీట్​ పరీక్షను 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 1న (ఆదివారం) పెన్ను, పేపర్​ విధానంలో చేపడుతున్నారు.

ఇదీ చూడండి:రిజరేషన్లకు 50% పరిమితిపై సుప్రీంలో వాదనలు

ABOUT THE AUTHOR

...view details