ఎన్సీబీ జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik News).. మరోసారి విమర్శలు గుప్పించారు. వాంఖడే ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను కించ పరిచేందుకే డ్రగ్స్ కేసు పేరుతో (Cruise Ship Drugs Case) భాజపా కుట్ర పన్నిందని ఆరోపించారు. నోయిడాలో ఫిల్మ్‌సిటీ రావాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరుకుంటున్నారని.. బాలీవుడ్‌ను అప్రతిష్ఠపాల్జేయడం ద్వారా యూపీవుడ్ను నిర్మించవచ్చని వారు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు.
అతడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?
క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ (Cruise Ship Drugs Case) నిర్వహించిన కాషిఫ్ ఖాన్‌ను ఎన్సీబీ ఎందుకు అరెస్ట్ చేయలేదని నవాబ్ మాలిక్ ప్రశ్నించారు. కాషిఫ్.. వాంఖడే స్నేహితుడు కావడం వల్లే అతడిని (Nawab Malik News) అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసి బెయిల్ రానివ్వకుండా ప్రయత్నించిన వ్యక్తే ఇప్పుడు తన అరెస్ట్ నుంచి రక్షణ కల్పించమని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కారని.. వాంఖడేను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు నవాబ్ మాలిక్. కేవలం ఒక్క నెలలో పరిస్థితులు మారిపోయాయని వ్యాఖ్యానించారు.
మేము కూడా మరాఠీలమే..
'తాము మరాఠీలమని, ఓ మరాఠీగా ముఖ్యమంత్రి తమకు సాయపడాలని వారు(వాంఖడే కుటుంబసభ్యులు) సీఎంకు లేఖ రాశారు. నవాబ్ మాలిక్ కుటుంబం కూడా గత 70 ఏళ్లగా ఇదే పట్టణంలో ఉంటోంది. నేను 1959లో జన్మించిన నేను కూడా ముంబయి వాసినే. మరి ఇప్పుడు నవాబ్ మాలిక్ మరాఠీ కాదా?'