Plastic Ban: ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులపై దేశవ్యాప్తంగా జులై 1 నుంచి నిషేధం అమలులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నోటీఫై చేసింది. ముఖ్యంగా తక్కువ పరిమాణం కలిగిన ఒకేసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులను తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడం, సరఫరా, అమ్మకంతోపాటు వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిషేధిత జాబితాలో ఏయే వస్తువులు ఉన్నాయో తెలియజేస్తూ తాజాగా ప్రకటన జారీ చేసింది.
నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు ఇవే..
- ఇయర్‌బడ్స్ (Earbuds with Plastic Sticks)
- బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్ (Plastic sticks for Balloons)
- ప్లాస్టిక్ జెండాలు (Plastic Flags)
- క్యాండీ స్టిక్స్-పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు (Candy Sticks)
- ఐస్‌క్రీమ్ పుల్లలు (Ice-cream Sticks)
- అలంకరణ కోసం వాడే థర్మోకోల్ (Thermocol)
- ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు..
- వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ప్లాస్టిక్
- ఆహ్వాన పత్రాలు (Invitations)
- సిగరెట్ ప్యాకెట్లు (Cigarette Packets)
- 100 మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు (Plastic or PVC Banners)
- ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు (Stirrers)