తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొండచిలువ గుడ్ల కోసం 54 రోజులు రహదారి పనులు బంద్

ఓ కొండ చిలువ పెట్టిన గుడ్ల వల్ల జాతీయ రహదారి పనులు ఏకంగా 54 రోజుల పాటు నిలిచిపోయాయి. ఈ సంఘటన కేరళలోని కాసర్​గోడ్​లో జరిగింది. పైథాన్ గుడ్లను 54 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకొని.. అవి పొదిగిన అనంతరం పాము పిల్లలను అడవిలో వదిలిపెట్టారు.

python egg road construction
road construction stopped python

By

Published : May 17, 2022, 11:06 AM IST

Updated : May 17, 2022, 12:57 PM IST

కొండచిలువ గుడ్ల కోసం 54 రోజులు రహదారి పనులు బంద్

Highway works stopped for saving Python Eggs: కొండచిలువ గుడ్లను సంరక్షించేందుకు జాతీయ రహదారి పనులను ఏకంగా 54 రోజుల పాటు నిలిపివేసింది ఉరలుంగాల్ లేబర్ కాంట్రాక్ట్​ కోఆపరేటివ్ సొసైటీ (యూఎల్​సీసీ). ఈ సంఘటన కేరళలోని కాసర్​గోడ్​లో జరిగింది. 54 రోజుల పాటు జాగ్రత్తగా సంరక్షించిన అనంతరం.. మొత్తం 24 గుడ్ల నుంచి చిన్న పాము పిల్లలు బయటకు వచ్చాయి.

కొండచిలువ

రహదారి విస్తరణ పనులు చేపడుతున్న క్రమంలో ఓ పైథాన్​, దాని గుడ్లను ఓ మట్టి రంధ్రంలో కనుగొన్నారు యూఎల్​సీసీ కార్మికులు. దీంతో ఆ గుడ్లను కాపాడేందుకు పనులను నిలిపివేశారు. అటవీ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని పాము గుడ్లు పెడుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ దశలో గుడ్లను అక్కడి నుంచి తరలిస్తే పాడైపోతాయని.. రోడ్డు పనులనే ఆపాలని యూఎల్​సీసీ నిర్ణయించింది.

కొండచిలువ గుడ్లు

ఈ గుడ్లకు నష్టం జరిగితే సంస్థ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాసర్​గోడ్​ డీఎఫ్​ఓ ధనేశ్ కుమార్ తెలిపారు. కొండచిలువలు.. వన్య ప్రాణుల సంరక్షణ చట్టంలోని షెడ్యూల్​ 1 కిందకు వస్తాయని, వాటికి ఏదైనా హాని జరిగితే కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

పొదిగిన అనంతరం బయటకు వస్తున్న కొండచిలువ పిల్లలు

ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ సర్టిఫై చేసిన పాముల సంరక్షుడు అమీన్​.. గుడ్ల ఆరోగ్యాన్ని రోజూ పర్యవేక్షిస్తూ వచ్చారు. గుడ్లపై పగుళ్లు ఏర్పడిన అనంతరం అవి పొదిగినట్లు భావించి.. వాటిని అమీన్​ ఇంటికి తరలించారు. అక్కడ వాటిని ఓ అట్టపెట్టెలో పెట్టారు. 54 రోజుల పాట ఎంతో జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మొత్తం 24 గుడ్లు పొదిగాయి. ఆ పాము పిల్లలను అటవీ అధికారులు అడవిలో వదిలేశారు.

ఇదీ చూడండి:మర్మాంగాన్ని కొరికిన కొండచిలువ- బాత్​రూంలో ఉండగా..

Last Updated : May 17, 2022, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details