Nana Patole Controversial Statements: మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని మోదీని తిట్టగలను.. ఆయన్ను కొట్టగలను అంటూ పటోల్ వ్యాఖ్యలు చేశారంటూ భాజపా శ్రేణులు ఆరోపించాయి. ఇది కాస్త వివాదం కావడంతో తాను మోదీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. స్థానిక గూండాను ప్రస్తావిస్తూ అలా మాట్లాడినట్లు నానా పటోలే చెప్పుకొచ్చారు.
'మోదీని కొట్టగలను.. తిట్టగలను'- ఆ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై దుమారం - modi vs congress
Nana Patole Controversial Statements: ప్రధాని నరేంద్ర మోదీపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ భాజపా శ్రేణులు ఆరోపించాయి. ఇది కాస్త వివాదం కావడంతో ఆయన స్పందించారు.
భండారా జిల్లాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పటోలే.. నేను మోదీని ఓడించగలను.. ఆయన్ను తిట్టగలను అంటూ వ్యాఖ్యలు చేశారు. భాజపా కార్యకర్తలు దీనిపై ఆందోళన చేయడంతో పటోల్ మరో విధంగా స్పందించారు. 'నా నియోజకవర్గంలో మోదీ అనే గూండా గురించి ప్రజలు ఫిర్యాదు చేశారు. ఆ గూండా గురించే ఈ వ్యాఖ్యలు చేశాను' అంటూ పటోలే స్పష్టంచేశారు. ఇది ప్రధానిని ఉద్దేశించి కాదని తేల్చి చెప్పారు. పటోలే వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి దిగజారడం విడ్డూరంగా ఉందంటూ సోమవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. పటోలే శారీరకంగానే ఎదిగారని.. మానసికంగా ఎదగలేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:భాజపా-జేడీయూ మధ్య 'అశోక' వివాదం.. నేతల మాటల యుద్ధం