రాజస్థాన్లోని అజ్మేర్లో నిర్వహించిన పుష్కర్ ఫెయిర్లో (pushkar fair 2021) భారీ దున్న అందరి దృష్టిని ఆకర్షించింది. ఆరు అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవుతో ఉన్న ఈ ప్రత్యేకమైన ముర్రా జాతి దున్నను (pushkar fair rajasthan) జవహర్లాల్ జంగీడ్ అనే వ్యక్తి ప్రదర్శనకు తీసుకొచ్చారు. ఈ ఎద్దు విలువ రూ.24 కోట్లని (24 crore buffalo) జవహర్ వెల్లడించారు. దీనికి తాము 'భీమ్' పేరు పెట్టినట్లు తెలిపారు. 1500 కేజీల బరువు ఉన్న ఈ ఎద్దును చూసి సందర్శకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
భీమ్ వీర్యానికి భారీగా డిమాండ్ (murrah buffalo price 2021) ఉందని జవహర్ చెప్పారు. విదేశాలకు సైతం ఈ దున్న వీర్యాన్ని ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఐదారు దేశాల నుంచి తమకు ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. దీని వీర్యాన్ని ఉపయోగించి.. ఇలాంటి దున్నలను ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు.