తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Murrah Buffalo Dharma : ఏజ్​ 3ఏళ్లు.. డైలీ 15లీటర్ల పాలు.. అందాల పోటీల్లో ఎన్నో ప్రైజ్​లు.. రాష్ట్రంలో అందమైన గేదె ఇదే! - buffalo gets prizes in beauty contests

Murrah beauty Buffalo Dharma Special Story : అందంలోనూ, పాల ఉత్పత్తిలోనూ ఔరా అనిపిస్తోంది హరియాణాకు చెందిన ఓ ముర్రా జాతి గేదె. రోజుకు 15 లీటర్ల వరకు పాలు ఇస్తోంది. అందాల పోటీల్లోనూ పలు బహుమతులు అందుకుంది. ఆ ప్రత్యేకమైన గేదె గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

murrah-buffalo-dharma-special-story-murrah-breed-buffalo-worth-crores-in-haryana
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 10:10 AM IST

Murrah beauty Buffalo Dharma Special Story :హరియాణాలోని భివానీ జిల్లాలో ఓ ముర్రా జాతి గేదె.. రోజుకు 15 లీటర్ల పాలు ఇస్తోంది. కేవలం పాల విషయంలోనే కాకుండా అందంలోనూ అందరినీ ఆకట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన గేదెల అందాల పోటీల్లో పలు బహుమతులు సైతం అందుకుంది. దీంతో హరియాణా వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ఈ గేదె. ఈ ముర్రా జాతి గేదెకు ముద్దుగా ధర్మ అని పేరు పెట్టుకున్నాడు యజమాని.

ధర్మ యజమాని పేరు సంజయ్​. చిన్నప్పటి అది అతడి వద్దే పెరిగింది. ప్రస్తుతం ధర్మ వయసు మూడు సంవత్సరాలు. దానికి ఓ దూడ కూడా ఉంది. ధర్మ కారణంగా లాభాలు వస్తున్పప్పటికీ.. దాని పోషణకు కూడా అదే స్థాయిలో ఉందని చెబుతున్నాడు సంజయ్. మంచి ధర వస్తే ధర్మను విక్రయించేందుకు సిద్ధమని తెలిపాడు.

ధర్మ గేదె

దాదాపు రూ.61లక్షలకు ఈ ముర్రా జాతి గేదెను అమ్ముతానని సంజయ్​ చెబుతున్నాడు. రోజూ పచ్చిగడ్డి, వివిధ రకాల గింజలు, 40 కిలోల క్యారెట్లను థర్మకు ఆహారంగా పెడతానని అతడు పేర్కొన్నాడు. హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పంజాబ్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో నిర్వహించిన పలు అందాల పోటీల్లో ధర్మ బహుమతులు సాధించిందని వివరించాడు. "థర్మ చాలా అందంగా ఉంటుంది. ఇది చిన్న ఏనుగు వలే కనిపిస్తుంది. బహుశా హరియాణా రాష్ట్రంలోనే ఈ గేదె అందమైనది కావచ్చు" అని పశువైద్యులు డాక్టర్ హృతిక్ తెలిపారు.

ధర్మ గేదె

ముర్రా గేదెలు హరియాణాలో బాగా ప్రాచుర్యం పొందాయని కర్నాల్ పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ధర్మేంద్ర సింగ్ తెలిపారు. అయితే కేవలం భారత్​లో కాకుండా విదేశాల్లోనూ వీటికి మంచి ఆదరణ ఉందని వారు వెల్లడించారు. సాధారణ గేదెలతో పోలిస్తే.. ముర్రా జాతి గెదేలు ఎక్కువ పాలు ఇస్తాయని ఆయన వివరించారు. సగటున రోజుకు 15 నుంచి 20 లీటర్లు ఇస్తాయని ధర్మేంద్ర సింగ్ వెల్లడించారు. ఈ రకం గేదెలకు మంచి పోషణ అందిస్తే 30 వరకు ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. వీటి పాలల్లో మంచి పోషకాలు, 40 శాతం వరకు ప్రోటీన్లు ఉంటాయని ధర్మేంద్ర పేర్కొన్నారు.

రూ.కోట్లు పలుకుతున్న దున్నపోతు.. చూసేందుకు భారీగా వస్తున్న రైతులు.. స్పెషల్ ఏంటంటే?

350kg Fish Viral Video : జాలర్లకు చిక్కిన 350కిలోల 'మురు' చేప.. వీడియో చూశారా?

ABOUT THE AUTHOR

...view details