Gang rape: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ దళిత బాలికపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు.
నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. శనివారం ఉదయం బాలిక మృతదేహాన్ని పంట పొలాల్లో కనుగొన్నారు స్థానికులు. శరీరంపై గాట్లు, తీవ్ర గాయాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ మార్కండేయా షాహి, ఎస్పీ సంతోష్ మిశ్రా.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితులను పట్టించిన వారికి రూ.25వేల బహుమతి ఇస్తామని ప్రకటించారు. కేవలం 5 గంటల్లోనే దుండగుల సమాచారం తెలుసుకున్నారు.
"నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో దళిత బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఇప్పటి వరకు ఒక నిందితుడ్ని పట్టుకున్నాం. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. "