Mumbai Covid Cases: ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణతో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. భారత్‌లో కరోనా కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ముంబయిలో ఆదివారం ఒక్కరోజే 8 వేల 36 కేసులు వెలుగులోకి వచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే ఇది 2 వేలు ఎక్కువ కావడం గమనార్హం. మహారాష్ట్రలో మొత్తం 11,877 కొత్త కేసులు వచ్చాయి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
Delhi corona cases: దిల్లీలోనూ కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 3,194 మంది వైరస్ బారినపడ్డారు. 1156 మంది కోలుకున్నారు. దేశరాజధానిలో ప్రస్తుతం 8,397 యాక్టివ్ కేసులున్నాయి.
బంగాల్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. ఆదివారం 6,153 మందికి వైరస్ సోకింది.
Kerala posts 2,802 new infections
- కేరళలో 2,802 కొత్త కేసులు.. 78 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,43,289కి చేరింది. ఇప్పటివరకు 48,113 మంది కొవిడ్‌కు బలయ్యారు.
- కొద్దినెలలుగా దేశంలో నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో.. సగం కేరళవే కావడం గమనార్హం.
- కర్ణాటకలో వరుసగా రెండో రోజూ కొవిడ్ బాధితుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో 1187 కొత్త కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 30,09,557, మరణాలు 38,346కు చేరాయి.
- రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. కరోనా మార్గదర్శకాలను తప్పక పాటించాలని, మరోసారి లాక్డౌన్ కొనితెచ్చుకోవద్దని హెచ్చరించారు.
ఒమిక్రాన్..