మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు(Anil Deshmukh News) 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబయి కోర్టు. దేశ్‌ముఖ్‌ను విచారించేందుకు మరో 9 రోజులు రిమాండ్ కావాలని ఈడీ అధికారులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
అనిల్ దేశ్‌ముఖ్‌ను(Anil Deshmukh News) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో 12 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అనిల్ దేశ్ముఖ్తో పాటు కుందన్ షిందే, సంజీవ్ పలాండేలను సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్లు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.