తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Mr Tamilnadu Death : గుండెపోటుతో 'మిస్టర్ తమిళనాడు' మృతి.. జిమ్​లో ట్రైనింగ్​ ఇచ్చి.. - gym trainer died of a heart attack in chennai

Mr Tamilnadu Death : 'మిస్టర్ తమిళనాడు' టైటిల్​ విన్నర్​, ప్రముఖ బాడీ బిల్డర్​ యోగేశ్​ గుండెపోటుతో మరణించారు. జిమ్​లో యువకులకు ట్రైనింగ్​ ఇచ్చిన ఆయన.. బాత్​రూమ్​లోకి వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు.

Mr Tamilnadu Death
Mr Tamilnadu Death

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 10:47 PM IST

Updated : Oct 9, 2023, 10:55 PM IST

Mr Tamilnadu Death :ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మృత్యుఒడికి చేరుతున్నారు. వ్యాయమం, జిమ్​ చేస్తూ చాలా మంది యువకులు అక్కడిక్కడే కుప్పకూలుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. 'మిస్టర్ తమిళనాడు' టైటిల్​ విన్నర్​, ప్రముఖ బాడీ బిల్డర్​ యోగేశ్​ గుండెపోటుతో మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది
చెన్నై అంబత్తూర్​ మేనంపేడులోని మహాత్మా గాంధీ వీధికి చెందిన యోగేశ్​.. అనేక బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. 2021లోనే 9 బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నారు. 2021లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అనంతరం బాడీబిల్డింగ్​ పోటీలకు విరామం ప్రకటించిన యోగేశ్​.. ఓ జిమ్​లో ట్రైనర్​గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటూర్ బస్​స్టేషన్​ సమీపంలోని జిమ్​కు వెళ్లి.. అనేక యువకులకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన యోగేశ్​.. బాత్​రూమ్​కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు.

బాడీ బిల్డర్​ యోగేశ్​

ఎంతసేపయినా బాత్​రూమ్​ లోపలికి వెళ్లిన యోగేశ్​.. రాకపోవడం వల్ల యువకులకు అనుమానం వచ్చింది. వెంటనే తలుపులు పగలగొట్టి వెళ్లి చూడగా.. యోగేశ్​ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన యువకులు.. యోగేశ్​ను స్థానిక కిల్పౌక్​ ప్రభుత్వ ఆస్పత్రికి హూటాహుటిన తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. యోగేశ్​.. గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెళ్లైన తర్వాత బాడీబిల్డింగ్​కు విరామం ప్రకటించి తక్కువ బరువులు ఎత్తుతున్న యోగేశ్​.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. యోగేశ్ పనిచేస్తున్న జిమ్​కు వెళ్లి విచారించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బాడీ బిల్డర్​ యోగేశ్​
బాడీ బిల్డర్​ యోగేశ్​

బైక్​పై వెళ్తుండగా వృద్ధుడికి గుండెపోటు.. సెకన్ల వ్యవధిలోనే..
కొన్నాళ్ల క్రితం ఉత్తర్​ప్రదేశ్​ ఎటా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుక విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి అనంతరం బరాత్​లో పాల్గొన్న వరుడి సోదరుడు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో శుభకార్యం జరిగిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Heartburn VS Heart Attack : గ్యాస్ నొప్పికి, గుండెపోటుకి మధ్య తేడాలు ఏంటి? డాక్టర్లు ఏం అన్నారంటే..

Heart Attack: వాకింగ్​ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. అంతలోపే..!

Last Updated : Oct 9, 2023, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details