Mr India title winner arrested: మహిళ మెడలో నుంచి గొలుసును దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. మార్చి 17న రత్నా దేవి(58) మెడలోని గొలుసును కొట్టేసిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైన నిందితుడి ఫోటోలు ఆర్థిక అవసరాలే కారణం..
చెన్నైలోని మన్నాడి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ బీటెక్ రెండేళ్ల క్రితం పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక మొబైల్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొవిడ్ సమయంలో వ్యాపారంలో నష్టాలు చవిచూశాడు. రుణదాతల బాకీని తిరిగి చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు చోరీల బాట పట్టాడని తెలిసింది. ఫైజల్ స్వతహాగా బాడీ బిల్డర్. 2019వ సంవత్సరంలో బాడీ బిల్డింగ్‌లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు.
ఇదీ చదవండి:తాగిన మైకంలో నాలుగేళ్ల కుమారుడిని సజీవంగా పూడ్చిన తండ్రి