తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శిక్ష పూర్తైనా జైలులోనే ఖైదీ.. నాలుగేళ్లు నరకం.. చివరకు...

శిక్షాకాలం పూర్తైన ఖైదీని అదనంగా దాదాపు నాలుగేళ్లు జైలులోనే ఉంచారు అధికారులు. దీనిపై బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా.. సమగ్ర విచారణ చేపట్టి.. రెండు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్​ను ఆదేశించింది.

Man spends 4 years in jail after sentence
Man spends 4 years in jail after sentence

By

Published : Jul 28, 2022, 7:29 PM IST

మధ్యప్రదేశ్​లో ఓ ఖైదీని శిక్షాకాలం పూర్తయ్యాక కూడా జైలులోనే అక్రమంగా నిర్బంధించారు అధికారులు. శిక్షాకాలానికి అదనంగా దాదాపు నాలుగేళ్లు జైలులోనే ఉన్నాడు ఖైదీ. తనను ఇన్నేళ్లు అక్రమంగా నిర్బంధించారని.. అందుకు రూ.3లక్షల పరిహారం ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు అతడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ ధర్మాధికారి.. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి.. రెండు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్​ను ఆదేశించారు.

ఏం జరిగిందంటే: ఛింద్వారా జిల్లాలోని పతారి గ్రామానికి చెందిన సింగ్​ ఓ హత్య కేసులో నిందితుడు. దీనిపై విచారించిన మధ్యప్రదేశ్​ హైకోర్టు 2005 మార్చి 14న జీవితఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానాను విధించింది. దీనిపై అతడు అప్పీల్​కు వెళ్లాడు. విచారణ చేపట్టిన న్యాయస్థానం శిక్షాకాలాన్ని తగ్గించింది. ఐదేళ్ల కఠిన కారాగారం, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 2006 సెప్టెంబర్​ 25న తీర్పు ఇచ్చింది. శిక్షాకాలం పూర్తైనప్పటికీ అదనంగా మరో నాలుగేళ్లు జైలులోనే ఉంచి 2012 జూన్​ 2న విడుదల చేశారు. అప్పుడు కూడా ఛింద్వారా సెషన్స్​ న్యాయస్థానం.. జైలు అధికారులకు లేఖ రాసిన తర్వాతే విడుదల చేశారని బాధితుడి తరఫు న్యాయవాది తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్​ హైకోర్టు.. ఈ లోపానికి ఎవరు బాధ్యులుగా తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details