మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో జలుబుతో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఈ వార్త మధ్యప్రదేశ్లోని ఆరోగ్యశాఖ అధికారులను కలవర పెడుతోంది. ఇప్పటికే వేలాది మందిని పొట్టన పెట్టుకున్న కరోనా... మూడో దశ ప్రారంభమైందని వారు భావిస్తున్నారు.
ముగ్గురు పిల్లల మరణ వార్తతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా షాక్కు గురైంది. దీంతో మాతా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఇతర వైద్య సిబ్బంది జిల్లాలోని పురషోత్తమపుర్ పంచాయతీ చందమరికి చేరుకుని అక్కడ అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వారు చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో అందరికి కొవిడ్ నెగటివ్ వచ్చింది. వారిలో జలుబుతో బాధపడుతున్న మరో 14 మంది నుంచి నమూనా సేకరించిన వైద్యాధికారులు వారి పరిస్థితిని నిరంతర పర్యవేక్షిస్తున్నారు.