తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రన్నింగ్​ ట్రైన్​​ నుంచి పడిన చిన్నారి.. కాపాడబోయి తల్లి కూడా... - రన్నింగ్ ట్రైన్​ నుంచి కిందపడి తల్లీకుమారుడు మృతి

Mother Son Train Death: రన్నింగ్ ట్రైన్​ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తల్లీకుమారులు మృతిచెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని భండారా జిల్లాలో జరిగింది. రైలు నాగ్​పుర్​ నుంచి మధ్యప్రదేశ్​లోని రేవాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

mother son train death
రన్నింగ్​ ట్రైన్ నుంచి పడి తల్లీ, కుమారుడు మృతి

By

Published : Jan 4, 2022, 2:47 PM IST

Mother Son Train Death: నడుస్తున్న రైలులోంచి ప్రమాదవశాత్తు పడి తల్లి, ఆమె ఏడాదిన్నర కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలను గుర్తించి పంచనామాకు తరలించారు పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్రలోని భండారా జిల్లాలో జరిగింది.

జరిగింది ఇదే..

మహారాష్ట్ర, నాగ్​పుర్​లోని ​టెకానకా ప్రాంతానికి చెందిన ఇషాంత్​ రామ్​టెకె, పూజ దంపతులు. ఇషాంత్​.. మధ్యప్రదేశ్​, రేవాలోని మిలిటరీ కాలేజీలో కెమిస్ట్రీ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. వారికి ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. కుటుంబం మొత్తం నాగ్​పుర్​ నుంచి మధ్యప్రదేశ్​లోని రేవాకు రైలులో ఆదివారం బయల్దేరారు.

మృతిచెందిన పూజ, అథర్వ

రైలు భండారా జిల్లాలోని దేవదా- మడ్గీ వెయిన్​గంగా నది బ్రిడ్జ్​ వద్దకు రాగానే.. చిన్నారి అథర్వను టాయిలెట్​కు తీసుకెళ్లింది పూజ.

పూజ, అథర్వ ఎంతసేపటికీ రాకపోగా.. రైలు మొత్తం గాలించి, సమీపంలో ఉన్న ఘోండియా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు ఇషాంత్. రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం గాలింపు చర్యలు చేపట్టారు.

బ్రిడ్జ్​పై వేలాడుతున్న పూజ మృతదేహం

బ్రిడ్జ్​పై వేలాడుతూ ఉన్న పూజ మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి అథర్వ మృతదేహాన్ని వంతెన కింద గుర్తించారు. అథర్వ పరిగెడుతూ రైలు నుంచి పడిపోయి ఉంటాడని, అతడిని కాపాడే ప్రయత్నంలో పూజ కూడా రైలు నుంచి పడిపోయి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. ఇద్దరి మృతదేహాలను పంచనామాకు తరలించి.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:మోదీకి నల్లజెండా చూపించిన మహిళపై దుండగుల కాల్పులు

ABOUT THE AUTHOR

...view details