తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్నానం చేస్తూ బావిలో పడ్డ బాలిక.. కాపాడబోయి దూకిన తల్లి.. ఇద్దరూ మృతి

తల్లీకూతుళ్లు బావిలో పడి చనిపోయిన ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. మొదట కూతురు బావిలో పడగా.. ఆమెను కాపాడేందుకు తల్లి ప్రయత్నించింది. ఆమె కూడా బావిలో దూకింది. ఇద్దరికీ ఈత రాకపోవడం వల్ల తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jan 28, 2023, 9:01 PM IST

ఝార్ఖండ్​లో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. తల్లీకూతుళ్లు బావిలో పడి చనిపోయారు. మొదట కూతురు బావిలో పడగా.. ఆమెను కాపాడేందుకు తల్లి సైతం బావిలో దూకింది. ఇద్దరికీ ఈత రాకపోవడం వల్ల తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ధన్​బాధ్​ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మృతులను మాలదేవి(32), ఆమె ఏడేళ్ల కూతురిగా పోలీసులు గుర్తించారు. టేతుల్మారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాలదేవి భర్త సుబోధ్ భూయాన్. పశ్చిమ మోడీదిహ్​లో వీరు నివాసం ఉంటున్నారు. శుక్రవారం మాలదేవి తన కూతురికి స్నానం చేయించేందుకు ఓ బావి వద్దకు వెళ్లింది. అనంతరం చిన్నారి కాలుజారి బావిలో పడిపోయింది. అది చూసి తట్టుకోలేని తల్లి.. కూతురిని కాపాడేందుకు బావిలో దూకింది. కాసేపటికి అటువైపు వెళ్లిన ఓ యువకుడు.. చుట్టుపక్కల వారి సాయంతో తల్లికూతుళ్లను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఇద్దరినీ బావిలో నుంచి బయటకు తీశాడు. అయితే అప్పటికే వారిద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు వారు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బావి వద్ద ఎవ్వరూ లేరని తల్లికూతుళ్లను బయటకు తీసిన యువకుడు తెలిపాడు. వారిద్దరికీ ఈత రాకపోవడంతో చనిపోయారని తెలిపాడు. ఘటనతో మృతుల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details