తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లో పేలిన సిలిండర్.. తల్లి, కొడుకు సజీవదహనం.. 12 పశువులు సైతం.. - జమ్ముకాశ్మీర్​లో సిలిండర్ పేలుడు

జమ్ముకశ్మీర్​లో విషాద ఘటన నెలకొంది. ఇంట్లో సిలిండర్​ పేలి మూడేళ్ల చిన్నారి సహా ఓ మహిళ మరణించింది. పలువురు గాయపడ్డారు.

Mother Son charred cylinder explodes
సిలిండర్ పేలి మూడేళ్ల కొడుకు, తల్లి మృతి

By

Published : Nov 24, 2022, 2:08 PM IST

సిలిండర్ పేలి తల్లితో సహా మూడేళ్ల చిన్నారి చనిపోయిన ఘటన జమ్ముకశ్మీర్​లో జరిగింది. పూంచ్​ జిల్లాలోని చండీమార్హ్ గ్రామంలో ఈ విషాదం జరిగింది. చనిపోయిన మహిళను హమీదా బేగం(40)గా, బాలుడిని అకిబ్ అహ్మద్(4) పోలీసులు గుర్తించారు. ఒక చిన్నారి తీవ్రంగా గాయపడగా... ప్రస్తుతం అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి భర్త, మరో ఇద్దరు ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో 12 పైగా పశువులు మరణించాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టినట్లు సూరన్​కోటే డీఎస్​పీ తన్వీర్​ జిలానీ తెలిపారు.

సిలిండర్ పేలి మూడేళ్ల కొడుకు, తల్లి మృతి
సిలిండర్ పేలి మూడేళ్ల కొడుకు, తల్లి మృతి

ABOUT THE AUTHOR

...view details