తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ ఏడాది సాధారణ వర్షపాతం: ఐఎండీ

దేశం​లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది దేశానికి శుభవార్త అని, ఈ ఏడాది వ్యవసాయ దిగుబడి సానుకూలంగా ఉంటుందని భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవన్ అన్నారు.

Monsoon,  India Meteorological Department
నైరుతి రుతుపవనాలు, సాధారణ వర్షపాతం

By

Published : Apr 16, 2021, 12:53 PM IST

భారత్​లో 75 శాతం వర్షపాతానికి కారణమయ్యే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని నమోదు చేస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం అంచనా వేసింది. ఈ వానాకాలంలో వర్షపాత దీర్ఘకాలిక సగటు(ఎల్​పీఏ) 98 శాతానికి దగ్గరగా ఉంటుందని భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవన్ తెలిపారు. జూన్​-సెప్టెంబర్​ మాసాలకు సంబంధించిన అంచనాలను ఆయన వర్చువల్​గా ప్రకటించారు.

వర్షకాలంలో ఎల్​పీఏ.. 96 నుంచి 104 శాతంగా ఉంటే దానిని సాధారణ వర్షపాతంగా గుర్తిస్తారు. ఇది దేశానికి శుభవార్త అని, ఈ సారి వ్యవసాయ దిగుబడి సానుకూలంగా ఉంటుందని రాజీవన్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:వాతావరణం మార్పుతో వైరల్‌ పంజా... అశ్రద్ధ తగదు!

ABOUT THE AUTHOR

...view details