తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2020, 9:35 PM IST

ETV Bharat / bharat

'ఆ విషయంలో మోదీ పక్కదారి పట్టిస్తున్నారు'

పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి విషయంలో ప్రజలను ప్రధాని మోదీ తప్పు దారి పట్టిస్తున్నారని బంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తమ రాష్ట్ర రైతులకు కిసాన్​ సమ్మాన్​ నిధి అందకుండా చేస్తోందని మండిపడ్డారు.

Modi trying to mislead people with distorted facts: Mamata on PM-KISAN in Bengal
ఆ విషయంలో ప్రజల్లి మోదీ పక్కదారి పట్టిస్తున్నారు

పీఎం​ కిసాన్ సమ్మాన్​ నిధి విషయంలో ప్రజలను ప్రధాని మోదీ పక్కదారి పట్టిస్తున్నారని బంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా మోదీ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శంచారు.

బంగాల్​లో పీఎం కిసాన్ సమ్మాన్​ పథకాన్ని అమలు చేయడం లేదని ప్రధాని ఆరోపించడాన్ని మమత తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజలకోసం కేంద్రంతో కలిసి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మమత తెలిపారు. అయినా ప్రధాని ఇలా మాట్లాడటం అర్థం లేని విషయమన్నారు.

ప్రధాని నిజాలు తెలసుకుని మాట్లాడాలని మమత హితవుపలికారు. పీఎం కిసాన్​ నిధుల పంపిణీ విషయమై ఇటీవలే కేంద్ర వ్యవసాయ మంత్రికి రాసిన లేఖను సీఎం గుర్తుచేశారు.

70లక్షల మంది బంగాల్​ రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్​ నిధి అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడతోందని ప్రధాని ఇటీవలే ఆరోపించారు. బంగాల్​ పథకాన్ని అమలుచేయటం లేదని మండిపడ్డారు.

ఇదీ చూడండి:బంగాల్​ ప్రతిష్టను మసకబార్చారు: మోదీ

ABOUT THE AUTHOR

...view details