తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Lokesh in Mission Rayalaseema: 'సీమ కష్టాలు చూశా.. సీమ కన్నీళ్లు తుడుస్తా'.. కడపలో లోకేశ్‌ హామీలు

Lokesh on Mission Rayalaseema: సీమ జిల్లాలను ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు చిరునామాగా మారుస్తాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. కడపలో మిషన్​ రాయలసీమ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో రాయలసీమ సమస్యలపై చర్చా వేదిక నిర్వహించారు.

Mission Rayalaseema
Mission Rayalaseema

By

Published : Jun 7, 2023, 7:03 PM IST

Updated : Jun 7, 2023, 7:45 PM IST

కడపలో లోకేశ్‌ హామీలు

Mission Rayalaseema: 'సీమ కష్టాలు చూశాను.. సీమ కన్నీళ్లు తుడుస్తాను' అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ భరోసా ఇచ్చారు. కడపలో మిషన్​ రాయలసీమ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో రాయలసీమ సమస్యలపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ చర్చా వేదికకు ప్రొఫెసర్​ రాజేశ్​ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మిషన్​ రాయలసీమపై ప్రముఖులతో లోకేశ్​ ముఖాముఖి నిర్వహించారు. సీమ జిల్లాలను ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు చిరునామాగా మారుస్తాం అని లోకేశ్‌ హామీ ఇచ్చారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కారిడార్ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి చేస్తామన్నారు.

ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీల ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని.. రాయలసీమలోని మైనింగ్ పరిశ్రమకు మరింత ప్రోత్సాహం అందిస్తామని లోకేశ్‌ స్పష్టం చేశారు. మైనింగ్‌లో తుది ఉత్పత్తి వరకు పూర్తి వాల్యూ చైన్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని.. మైనింగ్‌లో స్కిల్డ్ పనులు మనం రాష్ట్రం వాళ్లే చేసేలా నైపుణ్య శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీలను తీసుకువస్తామని లోకేశ్‌ తెలిపారు.

రైతన్నలకు లోకేశ్​ హామీలు: అలాగే రాయలసీమ రైతన్నలకు కూడా లోకేష్ హామీలు ఇచ్చారు. హార్టికల్చర్ హబ్​గా రాయలసీమ మారుస్తామని లోకేశ్​ తెలిపారు. సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామన్నారు. మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీని, అరటి తదితర పంటలు వేసేందుకు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్.. వివిధ హార్టికల్చర్ పంటలకు రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. దేశం, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులు ఎక్స్​పోర్ట్ చేసేలా, కొత్త రకాల మొక్కలు తయారు చేసే విధంగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. టమాటా వాల్యూ చైన్ ఏర్పాటు చేస్తామని.. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. వ్యవసాయానికి వినియోగించే యంత్రాలు, పరికరాలు ఏపీలో తయారు చేసి తక్కువ ధరకే సబ్సిడీలో రైతులకు అందిస్తామన్నారు.

సీడ్​ హబ్​గా ఏపీ: సీడ్ హబ్​గా ఏపీని మారుస్తామని హామీ ఇచ్చారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.. పాత బీమా పథకం అమలు.. రైతు బజార్లు పెంపుదల.. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం లక్ష్యంగా పని చేస్తామన్నారు. అలాగే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి పంటలు వెయ్యాలి అనే దానిపై ప్రభుత్వం నుంచే సలహాలు అందిస్తామని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని లోకేశ్​ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిర్చి, పసుపు పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కౌలు రైతులను గుర్తించి భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సాయం అందిస్తామని లోకేశ్​ భరోసా ఇచ్చారు.

సెంటు స్థలాల వ్యవహారంలో అవినీతి:మొత్తం రాయలసీమను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నామని లోకేశ్‌ అన్నారు. రాయలసీమకు పరిశ్రమలు తీసుకువచ్చిన పార్టీ టీడీపీ అని.. పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా తక్కువగా చూడలేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. వైసీపీకు ఇచ్చినన్ని సీట్లు టీడీపీకి ఇస్తే.. చెప్పింది చేసి చూపిస్తాం అని లోకేశ్​ స్పష్టం చేశారు. పేదవాళ్లకు ఇచ్చిన సెంటు స్థలాల్లో రూ.7 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

పాడి రైతుల కోసం ప్రత్యేక ప్రణాళిక: పాడి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని లోకేశ్‌ తెలిపారు. పశువుల కొనుగోలు నుంచి మేత, మందుల వరకు రాయితీలో అందజేస్తామన్నారు. గొర్రెలు, మేకల పెంపకానికి ప్రత్యేక సాయం అందిస్తామని.. ఉచితంగా గొర్రెలు, మేకల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పశువుల మేత కోసం బంజరు భూములు కేటాయిస్తామని ప్రకటించారు. ఫార్స్మ్​ ఏర్పాటుకు రాయితీ రుణాలు అందిస్తామన్నారు.

రాయలసీమలో స్పోర్ట్స్​ యూనివర్సిటీ: స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా రాయలసీమను తీర్చిదిద్దుతామని. రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తామని లోకేశ్​ ప్రకటించారు. అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులను పంపడం లక్ష్యంగా.. అన్ని రకాల క్రీడలకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీలు, స్టేడియాలు నిర్మిస్తామని తెలిపారు.

Last Updated : Jun 7, 2023, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details