Minor Raped in Ghaziabad: మైనర్పై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్ పరిధిలోని మురద్నగర్లో సోమవారం జరిగింది. ఆ చిన్నారి రెండో తరగతి చదువుతోంది. ఇప్పటివరకు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారు బాధితురాలికి బంధువులు, ఇంటికి సమీపంలోని వారేనని ప్రాథమిక విచారణలో తేలింది.
పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నారికి మాయమాటలు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లిన నిందితులు అక్కడ అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిగురించి ఎవరికీ చెప్పొద్దని బెదిరించి.. తిరిగి ఇంటికి పంపించారు. అసలు తనకేం జరిగిందో తెలియని చిన్నారి.. ఇంటికెళ్లి ఏడవడం ప్రారంభించింది. అది చూసిన తల్లిదండ్రులు పలుమార్లు అడగగా.. ఆ చిన్నారి జరిగింది చెప్పింది. హుటాహుటిన పోలీస్ స్టేషన్కు వెళ్లిన బాధితురాలి తల్లిదండ్రులు నిందితులపై ఫిర్యాదు చేసి.. ఆమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు.