Minor Killed EX-Lover: ఉత్తరాఖండ్‌లో దెహ్రాదూన్‌లో దారుణం జరిగింది. ఓ మైనర్ తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను హత్య చేసి చేసింది. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో తీసుకెళ్లి తన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో పాతిపెట్టింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
నలపానీ అవుట్‌పోస్ట్ ప్రాంతంలో యువకుడు నరేందర్(27) మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన పది రోజులకు పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నరేందర్‌కు ప్రేమ వ్యవహారం ఉందని తెలుసుకున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. 'నరేందర్ ప్రేమికురాలు పంచర్ షాప్ నిర్వహకుడు ఆకాశ్(22)తో ప్రేమలో ఉంది. చాలాసార్లు నరేందర్ తన ప్రియురాలుతో మాట్లాడాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో విసిగిపోయిన ఆమె.. తన కొత్త ప్రియునితో కలిసి పథకం పన్నింది. నరేందర్‌ను ఇంటికి పిలిచి హత్య చేశారు. అనంతరం బ్యాగులో తీసుకెళ్లి ఇంటికి దూరంగా భూమిలో పాతిపెట్టారు.' అని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానిరి పంపామని వెల్లడించారు.