తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లిపై అత్యాచారయత్నం.. మామను గొడ్డలితో నరికి చంపిన బాలికలు! - Minor Girls killed in kerala oldman dies

Minor Girls Kills Old Man Kerala: తమ తల్లిపై అత్యాచారం చేసేందుకు యత్నించిన మామపై గొడ్డలితో దాడి చేశారు ఇద్దరు బాలికలు. ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Minor Girls Kills Old Man
వృద్ధుడిని నరికి చంపిన బాలికలు

By

Published : Dec 28, 2021, 9:34 PM IST

Minor Girls Kills Old Man Kerala: తమ తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టేందుకు యత్నించిన మామను(మేనత్త భర్త)నరికి చంపారు ఇద్దరు బాలికలు. అనంతరం పోలీస్​స్టేషన్​లో లొంగిపోయారు. కేరళ వయనాడ్​ అంబాలావయల్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని అయిరంకొల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

ఏం జరిగిందంటే..?

అయిరంకొల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ (70).. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో బాలికల ఇంట్లోకి ప్రవేశించి వారి తల్లిని అత్యాచారం చేసేందుకు యత్నించాడు. దీంతో ఇద్దరు మైనర్​ మహమ్మద్​పై గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో అతడు మృతిచెందాడు. మృతదేహాన్ని బ్యాగులో కుక్కి.. స్థానికంగా ఉన్న బావిలో పడేశారు. అనంతరం అంబాలావయల్ పోలీస్ స్టేషన్​కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు.

బాలికలతోపాటు వారి తల్లిని అరెస్ట్​ చేశారు పోలీసులు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:29 ఏళ్లు పాక్​ జైల్లో మగ్గి.. ఎట్టకేలకు స్వదేశానికి...

ABOUT THE AUTHOR

...view details