దేశంలో కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతుండటం వల్ల ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ విధించవచ్చని వలస కార్మికులు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నఫళంగా లాక్‌డౌన్ విధిస్తే తమకు నాటి కష్టాలు మళ్లీ తప్పవన్న భయం కార్మికుల్లో నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా వారు పట్టణాలను వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇలా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి బిహార్‌కు తరలివస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో తూర్పు మధ్య రైల్వే వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది.
లాక్‌డౌన్ భయాలు- సొంతూళ్లకు వలస కార్మికులు - లాక్‌డౌన్ న్యూస్
కరోనా కేసులు పెరుగుతున్నందున మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే భయాలు వలస కార్మికుల్లో నెలకొన్నాయి. ముందుజాగ్రత్త చర్యగా వారు పట్టణాలను వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇలా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి బిహార్‌కు తరలివస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో తూర్పు మధ్య రైల్వే వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది.
లాక్‌డౌన్ భయాలు
గుజరాత్, దిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వలస కార్మికులు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు పయనమవుతుండటం గమనార్హం. ఇక్కడి పట్టణ ప్రాంతాల్లోని బస్సుస్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా నిరుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నఫళంగా లాక్‌డౌన్ విధించడంతో వలస కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. చేసేందుకు పని, ఉండేందుకు వసతి, తినేందుకు ఆహారం లేక... మండుటెండల్లో వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ తమ సొంత ప్రాంతాలను చేరుకున్నారు.