తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పండుగ రోజు సీఎంకు, సుప్రియకు తప్పిన ముప్పు! - సుప్రియ సూలే చీరకు నిప్పు

సంక్రాంతి పండుగ రోజు త్రుటిలో వేర్వేరు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే. చౌహాన్​ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ అత్యవసరంగా ల్యాండ్​ కాగా.. సుప్రియ చీరకు నిప్పంటుకుంది.

shivraj singh chauhan news
shivraj singh chauhan news

By

Published : Jan 15, 2023, 7:38 PM IST

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్​లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల టేకాఫైన ప్రదేశానికే తిరిగి వచ్చింది. ధార్​ వెళ్లేందుకు హెలికాప్టర్​ మనావర్ నుంచి బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించగానే సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల వెంటనే తిరిగి వెనక్కి వచ్చినట్లు ఎస్​డీఓపీ ధీరజ్​ తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ రోడ్డు మార్గంలో ధార్​కు వెళ్లినట్లు చెప్పారు.

ఎన్​సీపీ ఎంపీ సుప్రియా సూలే త్రుటిలో అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మహారాష్ట్ర పుణెలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె చీరకు నిప్పంటుకుంది. వేదికపై శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తున్న సమయంలో ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. అక్కడే ఉన్న కొందరు సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేశారు. అనంతరం మాట్లాడిన ఆమె.. ఎవరూ ఆందోళన చెందొద్దని.. తనకు ఏమీ కాలేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details