వంతెనపై నుంచి నదిలో పడ్డ బస్సు- ఆరుగురు మృతి - రోడ్డు ప్రమాదం
10:29 September 30
వంతెనపై నుంచి నదిలో పడ్డ బస్సు- ఆరుగురు మృతి
మేఘాలయలో ఘోర ప్రమాదం జరిగింది. నాంగ్‌చ్రామ్ వద్ద అర్ధరాత్రి ఓ బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ దర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. 16 మందిని కాపాడి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అతివేగమే బస్సు ప్రమాదానికి కారణమని గాయపడిన ప్రయాణికులు తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీయగా.. మరో రెండు బస్సులోనే ఉన్నట్లు చెప్పారు.
బస్సు తురా నుంచి షిల్లాంగ్‌కు వస్తున్న క్రమంలో నాంగ్‌చ్రామ్ వద్ద అదుపు తప్పి రింగ్దీ నదిలోకి దూసుకెళ్లినట్లు ఈస్ట్ గారో హిల్స్ పోలీసులు తెలిపారు.