ఈ వారం అమెరికాకు వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వరుస భేటీలతో బిజీబిజీగా గడపనున్నారు(modi us visit). అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, దిగ్గజ యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్‌తో పాటు అనేక మంది ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది(modi us visit 2021).
ఈ నెల 22న వాషింగ్టన్కు చేరుకోనున్నారు మోదీ(modi america news). ఆ తర్వాతి రోజు.. అమెరికాలోని సీఈఓలతో సమావేశం కానున్నారు. వీరిలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మోదీ షెడ్యూల్ బయటకు వస్తే దీనిపై మరింత స్పష్టత వస్తుంది.
ఆ తర్వాత.. కమలా హ్యారిస్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశముంది. ఓ భారత సంతతి మహిళ అమెరికా ఉపాధ్యక్షురాలి హోదాకు వెళ్లడం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి వీరి భేటీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
అదే రోజున.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యషిహిదే సుగాతో భేటీ అవుతారు మోదీ. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- నరేంద్ర మోదీ మధ్య అత్యంత కీలకమైన ద్వైపాక్షిక భేటీ జరగనుంది.
క్వాడ్ సదస్సు..
ఈ నెల 24న వాషింగ్టన్లో జరిగే క్వాడ్ సమావేశానికి మోదీ హాజరవుతారు(modi quad summit). క్వాడ్ దేశాధినేతలు ముఖాముఖిగా సదస్సులో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో క్వాడ్ నేతల మధ్య తొలి సదస్సు జరిగినప్పటికీ కరోనా కారణంగా ఈ నలుగురు నేతలు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఆ భేటీలోనే క్వాడ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్‌కు శ్రీకారం చుట్టగా.. భారత్ కూడా పలు దేశాలకు టీకాలను ఎగుమతి చేసింది. అయితే ఆ తర్వాత మన దేశంలో రెండో దశ రావడం వల్ల ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.