తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుండ్రటి ఈ-బైక్​ను రూపొందించిన 64 ఏళ్ల మెకానిక్​.. రూ.85వేల ఖర్చుతోనే అద్భుతం!

Mechanic Made Round Shape e-Bike : మెకానిక్​గా పనిచేసే 64 వృద్ధుడు ఓ వినూత్న ఈ-బైక్​ను రూపొందించాడు. నాలుగు నెలల పాటు కష్టపడి రూ.85 వేల ఖర్చుతో రింగ్​ బైక్​ను తయారు చేశాడు. ఆ వ్యక్తి, అతడు తయారు చేసిన బైక్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Mechanic Made Round Shape e-Bike 64 years old bike mechanic Natu bhai Patel gujarat made nnovative bike in
రౌండ్ షేప్ ఇ బైక్‌ను తయారు చేసిన మెకానిక్

By

Published : Aug 6, 2023, 2:08 PM IST

రింగ్ ఈ-బైక్​ను రూపొందించిన 64 ఏళ్ల మెకానిక్​

Mechanic Made Round Shape e-Bike : ఏడో తరగతి మాత్రమే చదివిన 64 ఏళ్ల మెకానిక్​.. ఓ వినూత్న ఈ-బైక్​ను తయారుచేశాడు. నాలుగు నెలల పాటు కష్టపడి.. గుండ్రటి ఆకారంలో బైక్​ను రూపొందించాడు. చిన్నప్పటి నుంచే కొత్తగా ఎదో చేయాలనే లక్ష్యంతో ఉన్న ఈ మెకానిక్​.. స్వతహాగా ఈ వెరైటీ రింగ్-బైక్​ను తయారు చేశాడు. గుజరాత్​లోని సూరత్​ జిల్లాకు చెందిన నటుభాయ్​ పటేల్.. ఇలా సరికొత్త బైక్​ను రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

నటుభాయ్ పటేల్​ను స్థానికులు సరదాగా 'నటుకాకా' అని పిలుచుకుంటారు. ఇతడు అథ్వా ప్రాంతంలోని ఆదర్శ్ బ్యాక్‌వర్డ్ క్లాస్ సొసైటీలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఓ చిన్నపాటి బైక్​ రిపేర్ షాప్​ నిర్వహిస్తూ.. జీవనోపాధి పొందుతున్నాడు. గత 40 ఏళ్లుగా అతడు ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు. ఆ అనుభవంతోనే రింగ్​ ఈ-బైక్​ను తయారు చేశాడు.

రౌండ్ షేప్ ఈ- బైక్‌ను తయారు చేసిన మెకానిక్

"నాకు ఎదో ఒకటి సాధించాలని కోరిక ఉండేది. దీంతో నేను ఈ రింగ్​ బైక్​ను తయారు చేశాను. ప్రజల వద్ద ఇలాంటి వెరైటీ ఈ-బైక్​లు నాకు కనిపించలేదు. అందుకే నేనే ఓ సరికొత్త బైక్​ను రూపొందించాలి అనుకున్నాను. నేను రింగ్​ బైక్​ను తీసుకుని బయటకు వెళ్లినప్పుడు.. తమకు కూడా ఇలాంటి బైక్​ తయారు చేయమని స్థానికులు అడుగుతున్నారు" అని నటుభాయ్ చెబుతున్నాడు. రింగ్​ బైక్​ తయారికి మొత్తం 85వేల రూపాయల ఖర్చు అయినట్లు అతడు వెల్లడించాడు. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 30 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని నటుభాయ్ తెలిపాడు. గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో వెళుతుందని పేర్కొన్నాడు.

రౌండ్ షేప్ ఈ బైక్‌ను తయారు చేసిన మెకానిక్

కొన్నేళ్ల క్రితం​ ఓ ఇంగ్లీష్​ సినిమా చూశానని.. అందులో ఇలాంటి బైక్​ను గుర్తించానని నటుభాయ్ చెప్పుకొచ్చాడు. ఆ స్పూర్తితోనే ఇప్పుడు ఈ రింగ్​ బైక్​ను రూపొందించినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం చాలా కంపెనీలు రింగ్​ బైక్​లు తయారు చేయాలనే ఆఫర్​ ఇస్తున్నట్లు నటుభాయ్ చెప్పుకొచ్చాడు. కానీ 64 ఏళ్ల వయసులో తాను ఎలాంటి పనులు చేయలేనని అతడు పేర్కొన్నాడు. తనకంతా సమయం కూడా లేదని వెల్లడించాడు.

ఈ రింగ్- బైక్​ తీసుకుని బయటకు వెళ్లినప్పుడు చాలా మంది దానిని డ్రైవ్​ చేస్తామని అడుగుతున్నారని నటుభాయ్ చెబుతున్నాడు. బైక్​పై సెల్ఫీలు దిగి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తారని అంటున్నారు. తాను బైక్ నడిపించుకుంటూ వెళుతున్నప్పుడు కూడా ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేస్తున్నారని నటుభాయ్ వివరించారు.

Chandrayaan 3 : 'జాబిల్లి' కక్ష్యలోకి 'చంద్రయాన్‌-3'.. ఇక నుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు..

పాత పెట్రోల్ వాహనాలను.. కొత్త ఎలక్ట్రిక్​ బైక్​గా.. ఓ వృద్ధురాలి వినూత్న ఆలోచన

ABOUT THE AUTHOR

...view details