దేశంలో కొరత నెలకొన్న ఆక్సిజన్, ఇతర అత్యవసర ఔషధాలపై కీలక ప్రకటన చేశారు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా. రానున్న రోజుల్లో వివిధ ఫార్మా సంస్థల నుంచి 7లక్షలకు పైగా రెమ్డెసివిర్ డోసులు, ముడి పదార్థాలు భారత్కు రానున్నాయని స్పష్టం చేశారు.
"గిలీడ్ సైన్సెస్ సంస్థ 4 లక్షల 50 వేల రెమ్డెసివిర్ డోసులు అందించేందుకు సుముఖత చూపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఎంతో అవసరం. రష్యా, యూఏఈలకు చెందిన సంస్థలు 3 లక్షల ఫావిపిరవిర్ డోసులు అందించనున్నాయి. టోసిలీజుమాబ్ ఔషధం జర్మనీ, స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 40 దేశాలు భారత్కు సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాయి.''