ఫేస్బుక్లో పరిచయం చేసుకొని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఓ యువకుడికి దగ్గరైంది కేరళ మహిళ. అప్పటికే తనకు వివాహం అయిందన్న విషయం దాచి.. యువకుడి నుంచి దాదాపు రూ. 11 లక్షల వరకు వసూలు చేసింది. ఈ ప్రక్రియలో సొంత భర్తే ఆ మహిళకు తోడయ్యాడు.
అసలేం జరిగిందంటే..
పార్వతి(31) అనే మహిళకు పండలమ్కు చెందిన మహేశ్ కుమార్‌కు 2020 ఏప్రిల్‌లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. మహేశ్ నరియాపురమ్లోని ఆటోమొబైల్‌లో షాపులో పనిచేస్తుండేవాడు. అయితే, మహేశ్‌కు తాను ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నట్లు పార్వతి చెప్పింది. ఎస్ఎన్ పురంలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు పేర్కొంది. క్రమంగా ప్రేమిస్తున్నానని నమ్మించి మహేశ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టింది పార్వతి.