ముస్లిం యువతి- హిందూ యువకుడి మధ్య జరిగే పెళ్లి చెల్లదని పంజాబ్- హరియాణా హైకోర్టు వ్యాఖ్యానించింది. ముస్లిం యువతి మతం మార్చుకుని.. హిందువుగా మారినప్పుడే వివాహం చెల్లుతుందని స్పష్టం చేసింది. 18ఏళ్ల ముస్లిం యువతి- 25ఏళ్ల హిందూ యువకుడు వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇదీ జరిగింది..
ఈ ఏడాది జనవరిలో.. ఓ 18ఏళ్ల ముస్లిం యువతి, 25సంవత్సరాల హిందూ యువకుడు శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే తమకు పెద్దల నుంచి ప్రాణభయం ఉందని అంబాల ఎస్పీని భద్రత కోరారు. ఆయన రక్షణ కల్పించలేదు. అనంతరం వారు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.