Maoist attack on Ex MLA: భాజపా మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ నాయక్‌పై మావోయిస్టులు దాడి చేశారు. ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే వెంట ఉండే ఇద్దరు బాడీగార్డులను నక్సల్స్ గొంతుకోసి చంపేశారు. ఎమ్మెల్యే మాత్రం త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. మూడు ఏకే 47 రైఫిళ్లను నక్సల్స్ అపహరించుకు పోయారని వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యేపై నక్సల్స్ దాడి- ఇద్దరు బాడీగార్డుల గొంతుకోసి...
पूर्व विधायक गुरुचरण नायक पर नक्सलियों ने हमला किया है. इस हमले में पूर्व विधायक के दो बॉडीगार्ड शहीद हो गए हैं. गुरुचरण गोयलकेरा के टुनिया गांव में फुटबॉल प्रतियोगिता में अतिथि बन गए थे. बताया जा रहा है कि इस हमले में पूर्व विधायक बाल बाल बच गए.
20:15 January 04
మాజీ ఎమ్మెల్యేపై నక్సల్స్ దాడి- ఇద్దరు బాడీగార్డుల గొంతుకోసి...
BJP Ex MLA Naxals attack
గోయీల్కెరాలోని తునియా గ్రామంలో నిర్వహించిన ఓ ఫుట్‌బాల్ పోటీలను వీక్షించేందుకు అతిథిగా వెళ్లారు గురుచరణ్ నాయక్. పోటీలు పూర్తైన తర్వాత విజేతలకు బహుమానాలు అందించారు. ఈ సమయంలోనే నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. వెంటనే దాక్కొనేందుకు ఎమ్మెల్యే పరిగెత్తారని చెప్పారు.
అయితే, ఇద్దరు పోలీసు బాడీగార్డులను మావోయుస్టులు హత్య చేశారని అధికారులు వివరించారు. గొంతు కోసి ప్రాణాలు తీశారని తెలిపారు. మరణించిన బాడీగార్డులను శంకర్ నాయక్, ఠాకూర్ హెంబ్రమ్గా గుర్తించారు. ప్రస్తుతం ఘటనా స్థలికి అదనపు బలగాలను పంపిస్తున్నామని స్థానిక ఎస్పీ అజయ్ లిండా తెలిపారు.
ఇదీ చదవండి:మహారాష్ట్రలో 18 వేలు- బంగాల్లో 9 వేల కొత్త కరోనా కేసులు