Man Trapped In Well : కేరళలో ఓ 55 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో చిక్కుకున్నాడు. శనివారం ఉదయం ఈ ఘటన జరగ్గా.. బాధితుడు ఇంకా బావిలోనే ఉన్నాడు. అతడ్ని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాజధాని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది. రాత్రంతా సహాయక చర్యలు జరిగినప్పటికీ.. బాధితుడ్ని బయటకు తీయడం సాధ్యం కాలేదు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
విళింజం సమీపంలోని ముక్కోల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన మహరాజన్ అనే వ్యక్తి.. బావిలోకి పైపులు దింపే పనికి వెళ్లాడు. అనంతరం బావిలోకి దిగి, అందుకు సంబంధించిన పనులు చేస్తుండగా.. పైనుంచి మట్టిపెళ్లలు కూలిపడ్డాయి. దీంతో ఆ మట్టిలోనే ఇరుక్కుపోయాడు మహరాజన్.
వ్యక్తి చిక్కుకున్న బావి ఇదే అధునాతన పరికరాలు తెప్పించేందుకు ప్రయత్నాలు..
Man Stuck In Well :శనివారం ఉదయం దాదాపు 9.30 గంటల ప్రాంతంలో ఘటనపై సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న పరికరాలతో బాధితుడ్ని కాపాడడం సాధ్యం కావట్లేదని అధికారులు వివరించారు. దీంతో అధునాతన పరికరాలను తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బావి వంద అడుగుల లోతు ఉందని వారు తెలిపారు. బాధితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినా.. చాలా ఏళ్లుగా అతడు విళింజం ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాడని అధికారులు వెల్లడించారు.
20 అడుగుల బావిలో పడి 8 మంది మృతి
కొన్ని నెలల క్రితం.. ఉత్తర్‌ప్రదేశ్ మహోబా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. అజ్నార్ స్టేషన్ పరిధిలోని మహౌబంద్ గ్రామంలో ఎనిమిది మంది కూలీలు 20 అడుగుల లోతులో బావి తవ్వుతుండగా.. వారిపై మట్టి, రాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మిగతావారు స్వల్ప గాయాలతో బయపడ్డారు. మృతులు రామ్‌సేవక్ అహిర్వార్(35), గ్యాసీలాల్(30)గా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్చేయండి.
బావిలో పడి ఐదుగురు కూలీలు..
అంతకుముందు, మేఘాలయలో పశ్చిమ జయంతియా హిల్స్ జిల్లాలో బావిలో పడి ఐదుగురు కూలీలు మరణించారు. 35 మీటర్ల లోతైన బావిలో నిర్మాణ పనులు జరుగుతుండగా అందులో పడి ఐదుగురు మృతి చెందారు. నీరు తోడటానికి ఉపయోగించిన పంపు నుంచి పొగ రావడం వల్ల వారు స్పృహ కోల్పోయి.. బావిలో పడిపోయారని అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.