కర్ణాటకలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. తాను పెంచుకున్న శునకాన్ని కరిచిందని.. వీధి కుక్కను కొట్టి చంపేశాడు చెందిన ఓ వ్యక్తి. ఈ బెంగుళూరు అర్బన్ జిల్లా ఆనేకల్ పట్టణంలోని హెబ్బగుడి రోడ్డులో జరిగిన ఘటనకు సంబంధించి అతనిపై కేసు నమోదైంది. దీంతో అతడు పరారయ్యాడు.
ఇదీ జరిగింది..
హెబ్బగుడి సమీపంలోని రోడ్డుపై ఓ వ్యక్తి పెంచుకుంటున్న శునకం, మరో వీధి కుక్క కలిశాయి. అయితే హఠాత్తుగా పెంపుడు శునకంపై వీధి కుక్క దాడి చేసింది. అతని ఇంటి వరకు వెంబడించి.. కరించింది. అప్పటికే మద్యం తాగి ఉన్న పెంపుడు కుక్క యజమాని.. ఈ సంఘటనను చూశాడు. కోపంతో ఊగిపోయి ఇనుప రాడ్డుతో వీధి కుక్కను కొట్టాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది. దానిని ఈడ్చుకెళ్లి సమీపంలోని రోడ్డు పక్కన పడేశాడు.