కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న 50 ఏళ్ల భార్యను ఆమె భర్త హత్య చేశాడు. మృతురాలిని శివమ్మగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలు శివమ్మకు రెండేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. ఆమె రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. కాలకృత్యాల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితికి వెళ్లిపోయింది శివమ్మ. ఆమె భర్త శంకరప్ప(60).. నిర్మాణంలో ఉన్న భవనానికి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు.
పక్షవాతంతో బాధపడుతున్న భార్యపై దారుణం.. 9 అడుగుల సంపులో ముంచి.. - కర్ణాటక క్రైమ్ న్యూస్
పక్షవాతంతో బాధపడుతున్న భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఓ భర్త. ఆమెను 9 అడుగుల సంపులో పడేసి హత్య చేశాడు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
తన భార్య ఆరోగ్య పరిస్థితి చూసి శంకరప్ప.. అసహ్యించుకునేవాడు. ఈ క్రమంలో ఆదివారం.. శంకరప్ప తన భార్య శివమ్మను ఎత్తుకెళ్లి నీళ్లతో నిండిన 9 అడుగుల సంపులో పడేసి హత్య చేశాడు. బయటకు వెళ్లి వచ్చిన శంకరప్ప 11 ఏళ్ల కుమారుడు సంపులో తల్లి మృతదేహాన్ని చూశాడు. వెంటనే ఇరుగుపొరుగువారికి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు శివమ్మ మృతదేహాన్ని సంపు నుంచి బయటకు తీశారు. అనంతరం శవ పరీక్షకు తరలించారు. నిందితుడు శంకరప్పను అరెస్ట్ చేశారు. తానే భార్యను సంపులో పడేసి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు.