తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వేరే మహిళతో తండ్రిని అలా చూశాడని కొడుకు దారుణ హత్య.. చేతులు నరికేసి.. ఉరేసి..

వేరే మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని చూశాడన్న కారణంతో కుమారుడినే హతమార్చాడు ఓ తండ్రి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, 17 ఏళ్ల టీనేజర్​ను బ్లాక్​మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె స్నేహితుడు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

man kills his son
కుమారుడిని హత్య చేసిన తండ్రి

By

Published : Dec 10, 2022, 9:48 PM IST

ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉండటాన్ని తన కుమారుడు చూశాడనే, కారణంతో ఓ తండ్రి ఆ బాలుడిని దారుణంగా హత్యచేశాడు. తొలుత అతని చేతులు నరికేసి, ఆపై ఉరేసి చంపేశాడు. మధ్యప్రదేశ్‌.. దేవాస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం..బాన్‌గర్డాకి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి, సమీప బంధువైన ఓ మహిళ(35)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉన్న సమయంలో.. అతని కుమారుడు(15) చూశాడు. దీంతో ఎక్కడ తమ విషయం బయటపడుతుందోనని భావించిన తండ్రి.. సొంత కుమారుడినే అంతమొందించాలనుకున్నాడు.

తొలుత బాలుడి చేతులు నరికేసి, ఆపై.. ఉరేసి హతమార్చాడు. నరికేసిన చేతులను 400 అడుగుల లోతైన బోరుబావిలోకి విసిరేశాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సమీపంలోని పొదల్లో పడేశాడు. బాలుడి మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాలుడి తండ్రిని సుదీర్ఘంగా విచారించారు. కుమారుడి అదృశ్యంపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అతను అసలు విషయం బయటపెట్టినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

17 ఏళ్ల టీనేజర్​పై..
బర్త్​డే వేడుకల్లో 17 ఏళ్ల టీనేజర్‌ తన స్నేహితురాలిని ముద్దు పెట్టుకున్నాడు. సెల్ఫీ తీసి దాచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తన కోరిక తీర్చకపోతే సెల్ఫీని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబయిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
17 ఏళ్ల వయసున్న బాధితురాలికి నిందితుడు ముందే తెలుసు. ఈ క్రమంలోనే అతడు ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ తీసుకున్నాడు. దానిని బయటపెడతానని బెదిరించి పలుమార్లు తన కోరిక తీర్చుకున్నాడు. కానీ, బాధితురాలు చదువుతున్న కాలేజీకి వెళ్లి తన వెంట రావాలని బలవంతం చేయడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కళాశాల ఆవరణలో జరుగుతున్న ఘర్షణ గురించి తోటి విద్యార్థులు బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కళాశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించడం వల్ల జరిగిందంతా చెప్పింది. అనంతరం బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు ఖార్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details